Header Banner

వైసీపీకి మరో ఊహించని షాక్! మాజీ ఎంపీపై నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు.. పీఎస్‌ నుంచి నేరుగా కోర్టుకు!

  Fri Apr 11, 2025 19:31        Politics

వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు చేశామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. శుక్రవారం గుంటూరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ విలేకర్లతో మాట్లాడుతూ గోరంట్ల మాధవ్ అరెస్ట్ వివరాలను విశదీకరించారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో చేబ్రోలు కిరణ్ కుమార్‌ను అరెస్ట్ చేశామని.. ఆ క్రమంలో పోలీసుల అదుపులో ఉన్న అతడిపై చుట్టగుంట వద్ద గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డారని తెలిపారు.

అయితే గోరంట్ల మాధవ్.. పోలీసులపై జులుం ప్రదర్శించడమే కాకుండా.. వారి విధులకు సైతం ఆటంకం కలిగించారన్నారు. ఇది నేరపూరత చర్య అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఈ దాడిలో గోరంట్ల మాధవ్‌తోపాటు మరో ఐదుగురు పాల్గొన్నారని వివరించారు. ఇక ఎస్పీ కార్యాలయం వద్ద సైతం చేబ్రోలు కిరణ్ కుమార్‌పై గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో గోరంట్ల మాధవ్‌పై నాన్ బెయిల్‌బుల్ కేసు నమోదు చేశామని ఎస్పీ వివరించారు.

వైఎస్ భారతీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్‌ను.. అతడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అరెస్ చేసి గుంటూరు తీసుకు వచ్చారు. ఆ క్రమంలో చేబ్రోలు కిరణ్ కుమార్‌పై గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం గోరంట్ల మాధవ్‌ను అరెస్ట్ చేశామని గుంటూరు జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం నగరంపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించి.. అటు నుంచి నల్లపాడు పీఎస్‌ తీసుకు వెళ్లినట్లు చెప్పారు. ఇక శుక్రవారం అంటే ఈ రోజు.. గోరంట్ల మాధవ్‌ను నల్లపాడు పోలీస్ స్టేషన్‌ నుంచి జీజీహెచ్‌కు తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని స్పష్టం చేశారు.


ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!


గోరంట్ల మాధవ్ హంగామా..
ఇక వైద్య పరీక్షల అనంతరం మాధవ్‌ ముఖానికి మాస్క్ వేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అందుకు అతడు ససేమీరా అన్నాడు. దీంతో మాస్క్ వేసుకోవాలంటూ మాధవ్‌ను పోలీస్ ఉన్నతాధికారులు కోరారు. మాస్క్ వేసుకునేందుకు అతడు నిరాకరించాడు. ఇక మీడియా సమావేశానికి రావలంటూ పోలీసుల కోరాగా.. రానంటూ వారికి ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ సమాధానం ఇచ్చాడు. దీంతో గోరంట్ల మాధవ్‌ను పోలీస్ ఉన్నతాధికారులు ప్రాథేయపడుతున్నట్లు తెలిసింది. అయితే.. ఎంపీగా పని చేసిన వ్యక్తిని ఎలా మీడియా సమావేశంలో ప్రవేశపెడతారంటూ గోరంట్ల మాధవ్ పోలీసులతో వాగ్వాదానికి దిగి.. భీష్మించుకోవడంతో.. అతడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టకుండానే.. నేరుగా కోర్టుకు పోలీసులు తరలించారు.

కోర్టు వద్దకు మాజీ మంత్రులు..
ఇక కోర్టు వద్దకు వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జునతోపాటు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. దీంతో కోర్టు వద్ద పోలీసులతో గోరంట్ల మాధవ్‌తోపాటు వైసీపీ నేతలు.. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #YSRCPShock #FormerMPArrested #NonBailableCase #PoliticalTwist #GorantlaMadhav